అమరావతి: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ జిల్లాల పర్యటనకు సిద్ధమయ్యారు. అక్టోబర్ నెలల్లో వివిధ జిల్లాల్లో ఆయన పర్యటించనున్నారు. ముందుగా పార్త్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో పవన్ పర్యటిస్తారు. అక్కడ సోషల్ వెల్ఫేర్ హాస్టల్ పరిశీలన, బాధిత కుటుంబాలను పరామర్శిస్తారు. అనంతరం తన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో రెండు లేదా మూడు రోజుల పర్యటన ఉండనుంది.
ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కూడా ఈ నెలలోనే పవన్ టూర్ ఉండనుంది. తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గంలో పంచాయతీ రాజ్ శాఖ కార్యక్రమంలో పవన్ పాల్గొంటారు. ఆయా ప్రాంతాల్లో ప్రభుత్వ కార్యక్రమాలు అనంతరం జన సైనికులు, వీర మహిళలు, నాయకులతో పవన్ సమావేశాలు నిర్వహించనున్నారు. కాగా డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ జిల్లాల పర్యటన తేదీలను త్వరలో అధికారులు ఖరారు చేయనున్నారు.