షర్మిల పట్ల జగన్‌కు ప్రేమ తగ్గలేదు: సజ్జల

సీఎం వైఎస్‌ జగన్‌, షర్మిల మధ్య రాజకీయంగానే కాక వ్యక్తిగతంగా కూడా విభేదాలు ఉన్నాయంటూ వార్తలు ప్రచారం ఉన్న విషయం తెలిసిందే.

By అంజి  Published on  26 March 2024 6:30 AM IST
YS Jagan, love, YS Sharmila, YCP , Sajjala, APnews

షర్మిల పట్ల జగన్‌కు ప్రేమ తగ్గలేదు: సజ్జల

సీఎం వైఎస్‌ జగన్‌, షర్మిల మధ్య రాజకీయంగానే కాక వ్యక్తిగతంగా కూడా విభేదాలు ఉన్నాయంటూ వార్తలు ప్రచారం ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వైసీపీ అగ్రనేత సజ్జల రామకృష్ణారెడ్డి ఓ ఇంటర్వ్యూలో వాటిని ఖండించారు. రాజకీయ లక్ష్యాలే తప్ప వైఎస్‌ కుటుంబంలో ఏ గొడవలూ లేవు అన్నారు. షర్మిల పట్ల అన్నగా జగన్‌ ప్రేమ ఏ మాత్రం తగ్గలేదన్నారు. షర్మిలే రాజకీయంగా తప్పటడుగు వేశారని అన్నారు. ఏపీలో వచ్చే ఎన్నికల్లో ఆమె ప్రభావం ఏ మాత్రం ఉండదని సజ్జల పేర్కొన్నారు.

పవన్‌పై వ్యక్తిగతంగా తనకు ఎలాంటి కక్షా లేదని సజ్జల పేర్కొన్నారు. వ్యక్తిగతంగా పవన్‌ను చూస్తే జాలేస్తోందని ఆయన పేర్కొన్నారు. అంత కరిష్మా ఉన్న వ్యక్తి పదేళ్లుగా ఇలాంటి రాజకీయం చేస్తారా? అని ప్రశ్నించారు. రాజకీయాలపై పవన్‌కు ఒక క్లారిటీ లేదన్నారు. తమ నాయకుడిని తిట్టినప్పుడు తమ పార్టీ నేతలు తిరిగి కౌంటర్ ఇవ్వడంలో తప్పు ఏముందన్నారు. అటు వైపు నుంచి యాక్షన్ ఉంటే.. మా వైపు నుంచి కూడా రియాక్షన్ ఉంటుందన్నారు. ఓ కోఆర్డినేషన్‌తో తిట్టించే విధానం టీడీపీది అన్నారు.

టీడీపీ నేత నారా లోకేష్‌ రెడ్‌బుక్‌పై సజ్జల కీలక వ్యాఖ్యలు చేశారు. నారా లోకేష్‌ రెడ్‌బుక్‌ దేనికో అర్ధం కావడం లేదన్నారు. ప్రజలకు ఏం చేస్తామో చెప్పకుండా ఈ బుక్‌ ఏంటి? అని ప్రశ్నించారు. ముందు లోకేష్‌ మంగళగిరిలో గెలవాలి కదా? అని ఎద్దేవా చేశారు. తమ పార్టీ కేడర్‌ను ఇబ్బంది పెట్టిన వైసీపీ నేలు, పోలీసులు, చట్టాన్ని ఉల్లంఘించిన వారి పేర్లను ఈ బుక్‌లో రాస్తున్నట్టు లోకేష్‌ గతంలో తెలిపారు.

Next Story