జగన్‌ సర్కార్‌ గుడ్‌న్యూస్‌.. దివ్యాంగులకు 5 శాతం రిజర్వేషన్లు

దివ్యాంగులకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. అభివృద్ధి కార్యక్రమాల్లో వారికి 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

By అంజి  Published on  20 Dec 2023 6:52 AM IST
Jagan govt, reservations, disabled, APnews

జగన్‌ సర్కార్‌ గుడ్‌న్యూస్‌.. దివ్యాంగులకు 5 శాతం రిజర్వేషన్లు

దివ్యాంగులకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. అభివృద్ధి కార్యక్రమాల్లో వారికి 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వ్యవసాయ భూముల పంపిణీ, ఇళ్ల స్థలాల కేటాయింపు, గృహ నిర్మాణం, ఆశ్రయ కల్పన, వృత్తి, వ్యాపారం, వినోదం, ఉత్పత్తి కేంద్రాలు, ఇతర సంస్థల ఏర్పాటులో రిజర్వేషన్లు తప్పనిసరి చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. మహిళా దివ్యాంగులకు ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేసింది.

మరోవైపు విద్యారంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చిన వైసీపీ ప్రభుత్వం.. దివ్యాంగుల సర్వతోముఖాభివృద్ధికి డిజిటల్‌ విద్యను చేరువ చేసింది. ఈ ప్రక్రియలో భాగంగా దివ్యాంగుల విద్యకు అవసరమైన ట్యాబ్‌లను అందజేసింది. ట్యాబ్‌ల్లో ప్రత్యేక యాప్‌లు పొందుపరిచి వాటితో విద్యాబోధన చేస్తున్నారు. దివ్యాంగ విద్యార్థులకు బోధించే ఉపాధ్యాయులకు, ఐఈఆర్పీలకు కూడా ప్రభుత్వం ట్యాబ్‌లు అందజేసింది. రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న ఆధునిక సాధనాలు వినియోగించుకుంటున్న దివ్యాంగులు బంగరు భవిత దిశగా అడుగులు వేస్తున్నారు.

Next Story