తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పుట్టినరోజు నేడు. ఆయన పుట్టినరోజుకు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. దేవుడి ఆశీస్సులతో నిండు ఆరోగ్యంతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్టు చెప్పారు జగన్.

"చంద్రబాబునాయుడు గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. భగవంతుని ఆశీస్సులతో మీరు నిండు ఆరోగ్యంతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను" అని ట్వీట్ చేశారు సిఎం జగన్. చంద్రబాబు కూడా అంతే గౌరవంతో 'థాంక్యూ వెరీ మచ్ జగన్ గారూ' అంటూ ఆ ట్వీట్ కు రిప్లై ఇచ్చారు. ఇప్పుడు ఈ ట్వీట్ సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతూ ఉంది.

నారా చంద్రబాబు నాయుడుకి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడిగా.. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో, ప్రజా జీవితంలో చంద్రబాబు తనదైన ముద్ర వేసుకున్నారని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఆయన ఆయురారోగ్యాలతో ఆరోగ్యవంతంగా ఉండాలని పవన్ ఆకాంక్షించారు.
సామ్రాట్

Next Story