ISRO : నింగిలోకి దూసుకెళ్లిన ఎల్‌వీఎం-3 రాకెట్

షార్‌లోని రెండో ప్ర‌యోగ వేదిక నుంచి ఆదివారం ఎల్‌వీఎం-3 వాహ‌క‌నౌక నింగిలోకి దూసుకు వెళ్లింది

By తోట‌ వంశీ కుమార్‌  Published on  26 March 2023 9:52 AM IST
ISRO, LVM3-M3

నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకువెలుతున్న ఎల్‌వీఎం-3 వాహ‌క‌నౌక‌

శ్రీహ‌రికోట‌లోని స‌తీష్ ధావ‌న్ స్పేస్ సెంట‌ర్‌(షార్‌)లోని రెండో ప్ర‌యోగ వేదిక నుంచి ఆదివారం ఎల్‌వీఎం-3 వాహ‌క‌నౌక నింగిలోకి దూసుకు వెళ్లింది. శ‌నివారం ఉద‌యం 8.30 గంట‌ల‌కు కౌంట్‌డౌన్ ప్ర‌క్రియ ప్రారంభం కాగా.. 24.30 గంట‌ల పాటు కొన‌సాగింది. కౌంట్ డౌన్ పూర్తి అయిన‌ వెంటనే నిప్పులు చిమ్ముకుంటూ ఈ ఉద‌యం 9 గంట‌ల‌కు వన్‌వెబ్‌కు చెందిన 36 ఉప‌గ్ర‌హాల‌ను ఎల్‌వీఎం-3 వాహ‌క నౌక తీసుకువెళ్లింది. ఇస్రో వాణిజ్య ప్రయోజనాల కోసం ఎల్వీఎం-3 రాకెట్ ను రూపొందించారు. ఈ వాహ‌క నౌక తీసుకువెళ్లిన ఉప‌గ్ర‌హాల బ‌రువు 5.8 ట‌న్నులు. వీటిని ఎల్వీఎం-3 రాకెట్ వివిధ కక్ష్యల్లో ప్రవేశపెట్టనుంది.

యూకేకు చెందిన నెట్‌వ‌ర్క్ యాక్సెస్ అసోసియేష‌న్ లిమిటెడ్ కంపెనీ, భార‌త్‌కు చెందిన భార‌తి ఎంట‌ర్‌ప్రెజెస్ సంయుక్తంగా వ‌న్‌వెబ్ ఇండియా-2 పేరుతో రూపొందించిన 5,805 కిలోల బ‌రువు క‌లిగిన 36 ఉప‌గ్ర‌హాల‌ను భూమికి 450 కిలోమీట‌ర్ల ఎత్తులోని లియో ఆర్బిట్‌లో 87.4 డిగ్రీల వంపులో వృత్తాకార క‌క్ష్య‌లో ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు.

Next Story