బహుజన సోదరులారా.. ఆలోచించండి అంటూ బీఎస్‌పీ తెలంగాణ చీఫ్ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ఎక్స్‌లో ఓ పోస్టు చేశారు. నంద్యాలలో వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రాంరెడ్డి దోబీ ఘాట్ల శంకుస్థాపనలో రజక సోదరులు వేదికపై కూర్చోనేందుకు నిరాకరించారు. జగన్ గారు.. సామాజిక న్యాయం, సమానత్వం విగ్రహాలు, స్లోగన్లకే పరిమితమా? అంటూ ప్రశ్నించారు.
గత నెలలో సీఎం వైఎస్ జగన్.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఎత్తైన విగ్రహాన్ని ప్రతిష్టించి దాన్ని స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అని అన్నారని, మరో వైపు నంద్యాల జిల్లాలో వారి వైసీపి ఎమ్మెల్యే కాటసాని రాంరెడ్డి దోబీ ఘాట్ల శంకుస్థాపన కార్యక్రమంలో రజక సోదరులకు వేదికపై స్థానం కల్పించకుండా నిరాకరించారని ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు.
''అంటే సామాజిక న్యాయం, సమానత్వం కేవలం విగ్రహాలకు, స్లోగన్లకే పరిమితమా?? బహుజన సోదరులారా, ఇంకెన్నాళ్లు మనం ఈ అవమానాలు భరిద్దాం? వందకు 99 మందిమి ఉండి మనల్ని నిరంతరం అవమానించే పార్టీలకే మళ్లీ ఓటేద్దామా ? మన బహుజన రాజ్యం తెచ్చుకోలేమా? ఆలోచించండి'' అంటూ ప్రజలకు ప్రవీణ్ కుమార్ సూచించారు.