విషాదం.. పరీక్షా కేంద్రంలో గుండెపోటుతో ఇంటర్ విద్యార్థి మృతి

Inter Student died with heart attack in exam centre.ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఇంట‌ర్ ప‌రీక్ష‌లు జ‌రుగుతున్న సంగ‌తి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  10 May 2022 12:15 PM IST
విషాదం.. పరీక్షా కేంద్రంలో గుండెపోటుతో ఇంటర్ విద్యార్థి మృతి

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఇంట‌ర్ ప‌రీక్ష‌లు జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో పరీక్షా కేంద్రంలో విద్యార్థి మృతి చెందిన ఘ‌ట‌న తిరుప‌తి జిల్లా గూడూరులో చోటు చేసుకుంది. ఇంట‌ర్ సెకండ్ ఇయ‌ర్ చ‌దువుతున్న సైదాపూర్‌కు చెందిన స‌తీష్(18) అనే విద్యార్థి ఇంట‌ర్ ప‌రీక్ష‌లు రాసేందుకు రోజులాగే ఈ రోజు ఉద‌యం గూడూరులోని డీఆర్‌డ‌బ్ల్యూ క‌ళాశాల వ‌ద్ద‌కు వ‌చ్చాడు. ఆ స‌మ‌యంలో ఛాతాలో నొప్పి ఉందని చెప్పినట్టు సమాచారం.

ఆ తర్వాత స‌తీష్ గుండెపోటు వచ్చి కుప్పకూలిపోయాడు. ఉన్న‌ట్లుండి ఒక్క‌సారిగా ప‌రీక్షా కేంద్రంలో కుప్ప‌కూలిపోవ‌డంతో వెంట‌నే స‌హ‌చ‌ర విద్యార్థులు, ఉపాధ్యాయులు అత‌డిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అయితే.. అప్ప‌టికే విద్యార్థి స‌తీష్ మృతి చెందిన‌ట్లు వైద్యులు తెలిపారు. సతీష్ మృతి చెందినట్టు అతని తల్లిదండ్రులకు పోలీసులు సమాచారం అందించారు. ఈ ఘటనతో పరీక్ష కేంద్రం వద్ద విషాదం నెలకొంది. త‌మ‌తో ప‌రీక్ష రాయ‌డానికి వ‌చ్చిన త‌మ మిత్రుడు ఇక లేడ‌నే వార్త విన్న విద్యార్థులు క‌న్నీరు మున్నీరుగా విల‌పిస్తున్నారు.

Next Story