AndhraPradesh: అలర్ట్‌.. రానున్న 3 రోజుల పాటు తీవ్ర ఎండలు

రానున్న మూడు రోజులు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఎండల ప్రభావం ఎక్కువగా ఉంటుందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.

By అంజి
Published on : 27 May 2024 9:23 PM IST

Intense sun, Andhra Pradesh,  Disaster Management Authority

AndhraPradesh: అలర్ట్‌.. రానున్న 3 రోజుల పాటు తీవ్ర ఎండలు

రానున్న మూడు రోజులు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఎండల ప్రభావం ఎక్కువగా ఉంటుందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. రేపు 149 మండలాల్లో తీవ్ర వడగాలులు, 160 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని ఆ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. ఎల్లుండి 195 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 147మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు.

వృద్ధులు, గర్భిణులు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఇవాళ తిరుపతి జిల్లాలోని సత్యవేడులో 41.9 డిగీల్ర ఉష్ణోగ్రత, నెల్లూరు జిల్లా మనుబోలులో 41.5 డిగ్రీలు, బాపట్ల జిల్లా వేమూరు, కృష్ణా జిల్లా పెడనలో 40.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయని తెలిపింది.

Next Story