మరో కీలక అంతరిక్ష ప్రయోగానికి ఇస్రో శ్రీకారం..ఈ నెలలోనే

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో కీలక ఘట్టానికి సిద్ధమవుతోంది.

By -  Knakam Karthik
Published on : 7 Jan 2026 10:52 AM IST

Andrapradesh, Sriharikota, Satish Dhawan Space Centre, Indian Space Research Organisation

మరో కీలక అంతరిక్ష ప్రయోగానికి ఇస్రో శ్రీకారం..ఈ నెలలోనే

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో కీలక ఘట్టానికి సిద్ధమవుతోంది. కక్ష్యా ప్రయోగాలను తిరిగి ప్రారంభిస్తూ PSLV-C62 మిషన్‌ను జనవరి 12, 2026 ఉదయం 10:17 గంటలకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ – ఫస్ట్ లాంచ్ ప్యాడ్ (FLP) నుంచి ప్రయోగించనుంది. ఈ ప్రయోగం పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (PSLV) యొక్క 64వ ప్రయాణం, అలాగే రెండు స్ట్రాప్-ఆన్ బూస్టర్లతో కూడిన PSLV-DL వేరియంట్‌కు ఐదో ప్రయోగం కావడం విశేషం. . ఈ మిషన్‌లో ప్రయోగించబోయే ఈఓఎస్-ఎన్1 హైపర్‌స్పెక్ట్రల్ ఇమేజింగ్ ఉపగ్రహం విశేషం. ఇది భూభాగంపై ఉన్న వస్తువుల ఆకారాలు, రంగులు మాత్రమే కాక,వందలాది సూక్ష్మ తరంగదైర్ఘ్యాల ద్వారా వాటి స్వభావాన్ని కూడా గుర్తించగల సామర్థ్యం కలిగి ఉంది.

ఖనిజాలు,పంటలు,నీటి వనరులు, భూభాగ వినియోగం వంటి భూఅంశాలను మరింత ఖచ్చితంగా విశ్లేషించడానికి ఈ ఉపగ్రహం ఉపయోగపడనుంది. ప్రధాన ఉపగ్రహం తో పాటు మరో 18 చిన్న ఉపగ్రహాలను కూడా పీఎస్‌ఎల్‌వీ ద్వారా కక్ష్యలోకి పంపనున్నారు. వీటిలో కొన్ని భారతదేశానికి చెందినవే, మరికొన్ని అంతర్జాతీయ వినియోగదారులవే. ఈ ప్రయోగ సేవలను ఇస్రో పారిశ్రామిక భాగస్వామి న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ (ఎన్‌ఎస్‌ఐఎల్) మార్కెట్ చేస్తోంది. ఇప్పటివరకు ఎన్‌ఎస్‌ఐఎల్ పీఎస్‌ఎల్‌వీ, ఎల్‌వీఎం3, ఎస్‌ఎస్‌ఎల్‌వీ రాకెట్ల ద్వారా 137కి పైగా కస్టమర్ ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించింది.

Next Story