అమరావతి: పోలీస్ కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలు కొన్ని జిల్లాల్లో వాయిదా పడ్డాయి. వైకుంఠ ఏకాదశి, ఇతర లా అండ్ ఆర్డర్ సమస్యల వల్ల వాయిదా వేస్తున్నట్టు రాష్ట్ర పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ ప్రకటించింది. వీటిని జనవరి 11 నుంచి 20వ తేదీ మధ్య నిర్వహించనున్నట్టు పోలీసు నియామక మండలి చైర్మన్ ఎం. రవి ప్రకాశ్ తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో జనవరి 8న జరగాల్సిన పరీక్షలను జనవరి 11న నిర్వహిస్తామని తెలిపారు.
అలాగే అనంతపురంలో 8,9,10 తేదీల్లో జరగాల్సిన పరీక్షలను 17 - 20 తేదీల్లో, చిత్తూరులో 8, 9 తేదీల్లో జరగాల్సిన ఫిజికల్ మేజర్‌మెంట్ టెస్ట్ (పిఎంటి), ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ (పిఇటి) 17, 18 తేదీలకు మార్చినట్టు పేర్కొంది. మిగతా జిల్లాల్లో యథాతథంగా పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. కానిస్టేబుల్ అభ్యర్థులకు పీఎంటీ/ పీఈటీ ఈవెంట్లు డిసెంబర్ 31 నుంచి ప్రారంభం అయ్యాయి. ఉమ్మడి 13 జిల్లా కేంద్రాల్లో ఫిబ్రవరి 1వ తేదీ వరకు ఇవి కొనసాగనున్నాయి. దేహదారుఢ్య పరీక్షల తర్వాత మెయిన్స్ పరీక్ష జరగనుంది. ఆ తర్వాత నియామక ప్రక్రియ ఉంటుంది.