సీఎం జగన్‌పై నేను దాడి చేయలేదు: వేముల సతీష్‌

సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిపై రాయి దాడి కేసుతో తనకు సంబంధం లేదని ఆ కేసులో నిందితుడిగా ఉన్న వేముల సతీష్‌ తెలిపారు.

By అంజి  Published on  2 Jun 2024 3:45 PM IST
CM Jagan, Vemula Satish, Andhrapradesh

సీఎం జగన్‌పై నేను దాడి చేయలేదు: వేముల సతీష్‌

సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిపై రాయి దాడి కేసుతో తనకు సంబంధం లేదని ఆ కేసులో నిందితుడిగా ఉన్న వేముల సతీష్‌ తెలిపారు. నెల్లూరు జైలు నుంచి బెయిల్‌పై విడుదల అయిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పోలీసులు తనను బెదిరించి ఈ కేసులో ఇరికించారని సతీష్‌ ఆరోపించారు. నేరం ఒప్పుకోకపోతే చంపేస్తామన్నారని తెలిపారు. తనను డ్రగ్స్‌, గంజాయి కేసుల్లో ఇరికించే ప్రయత్నం చేశారని సతీష్‌ ఆరోపించారు. తాను జగన్‌పై దాడి చేయలేదని, దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన వ్యాఖ్యానించారు.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై రాళ్లదాడి చేసిన కేసులో ప్రధాన నిందితుడు వేముల సతీష్‌కుమార్‌కు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి కమ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ సి.రమణారెడ్డి సిఆర్‌పిసి సెక్షన్ 445 కింద దాఖలు చేసిన పిటిషన్‌ను శనివారం విచారణకు అనుమతించారు. ఇరువర్గాల వాదనలు విన్న మేజిస్ట్రేట్ ఒక్కొక్కరు రూ.50 వేల చొప్పున ఇద్దరు పూచీకత్తులు సమర్పించడంతో సతీష్‌కు బెయిల్ మంజూరు చేస్తూ విడుదల ఉత్తర్వులు జారీ చేశారు. నిందితుడు ప్రతి శని, ఆదివారాల్లో అజిత్‌సింగ్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌హెచ్‌ఓ ఎదుట హాజరుకావాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Next Story