జూనియర్ ఎన్టీఆర్‌ను తాను అసభ్యకర పదాలతో దూషించినట్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆడియోపై అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ స్పందించారు. అది ఫేక్ ఆడియో అని స్పష్టం చేశారు. నారా, నందమూరి కుటుంబాలంటే తనకు చాలా అభిమానం అని అన్నారు. తానంటే గిట్టని వారే ఫేక్ ఆడియో, వీడియోలు సృష్టించి ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాధ పడి ఉంటే తనను క్షమించాలన్నారు. ఈ ఆడియోపై చర్యలు తీసుకోవాలని ఎస్పీకి ఫిర్యాదు చేశానని ఎమ్మెల్యే దగ్గుపాటి స్పష్టం చేశారు.
అటు జూనియర్ ఎన్టీఆర్‌ను దుర్భాషలాడారని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ క్యాంప్ ఆఫీసు వద్ద ఫ్యాన్స్ ఆందోళనకు దిగారు. తమ అభిమాన హీరోకి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ గురించి ఎవరు అగౌరవంగా మాట్లాడినా సహించబోమని హెచ్చరించారు.
వైరలవుతున్న ఆడియో ఇదే