బీమా డబ్బుల కోసం.. భార్యను ఆత్మహత్య చేసుకోమన్న భర్త.. టార్చర్‌ తట్టుకోలేక..

Husband harassed wife to commit suicide over Bheema money in AP. ఏపీలో నంద్యాల జిల్లాలో ఓ నిత్య పెళ్లి కొడుకు వ్యవహారం బట్టబయలైంది. ఒకరికి తెలియకుండా

By అంజి  Published on  25 Nov 2022 9:42 AM GMT
బీమా డబ్బుల కోసం.. భార్యను ఆత్మహత్య చేసుకోమన్న భర్త.. టార్చర్‌ తట్టుకోలేక..

ఏపీలో నంద్యాల జిల్లాలో ఓ నిత్య పెళ్లి కొడుకు వ్యవహారం బట్టబయలైంది. ఒకరికి తెలియకుండా మరొకరిని.. ఇలా వరుసగా ముగ్గురిని పెళ్లి చేసుకున్నాడు. అయితే రెండో భార్య విషయంలో భర్త క్రూరంగా ప్రవర్తించాడు. రెండో భార్యను ఆత్మహత్య చేసుకోవాలని వేధింపులకు గురి చేశాడు. ఆత్మహత్య బీమా డబ్బులు వస్తాయని ఆశించాడు. వేధింపులు తట్టుకోలేక రెండో భార్య హైదరాబాద్‌ వెళ్లిపోయింది. ఆ తర్వాత మూడో పెళ్లి కూడా చేసుకున్నాడు. ఈ క్రమంలో రెండో భార్య ఇతగాడి మోసాన్ని బయటపెట్టింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

నంద్యాల జిల్లా దొర్నిపాడు మండలం చాకరాజువేములకు చెందిన మహేంద్రబాబుకు మార్కాపురానికి చెందిన మహిళతో పెళ్లి జరిగింది. ఆ తర్వాత మహేంద్రబాబు మరో మహిళ వెంటబడ్డాడు. తన మొదటి పెళ్లి విషయాన్ని చెప్పకుండా.. నాలుగేళ్ల క్రితం రెండో పెళ్లి చేసుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత మహేంద్రబాబుకు ఇది వరకే మార్కాపురంకు చెందిన మరో మహిళతో పెళ్లి అయ్యిందని తెలిసింది. అయితే ఈ విషయంలో జాగ్రత్త పడేందుకు భార్యకు కట్టు కథలు చెప్పాడు. మొదటి భార్య చనిపోయిందని, నువ్వే తన లోకం అంటూ నమ్మించాడు. ఈ క్రమంలోనే రెండో భార్య పేరుతో ఉన్న బీమా డబ్బులపై కన్నేశాడు. రెండో భార్య ఆత్మహత్య చేసుకుంటే డబ్బులు వస్తాయని తల్లితో పలు మార్లు చెప్పాడు.

ఆ తర్వాత మహేంద్రబాబు రోజూ భార్యను వేధింపులకు గురి చేస్తూ వచ్చాడు. ఆత్మహత్య చేసుకోవాలని భార్యను టార్చర్‌ చేశాడు. దీంతో ఆమె హైదరాబాద్‌కు వెళ్లిపోయింది. అలా కొన్ని రోజుల తర్వాత కృష్ణా జిల్లా చల్లపల్లి మండలంకు చెందిన మరో మహిళతో పరిచయం పెంచుకున్నాడు. తనకు పెళ్లి కాలేదని ఆమెను నమ్మించి మూడో పెళ్లి చేసుకున్నాడు. అత్తంటి నుంచి రూ.5 లక్షలు, ఆమె తల్లి మొబైల్‌ ద్వారా ప్రైవేటు లోన్‌ యాప్‌ నుంచి రూ.5 లక్షలు లోన్ తీసుకున్నాడు. ఇంతలో మూడో పెళ్లి విషయం తెలిసిన రెండో భార్యకు తెలిసింది. వెంటనే అతడిపై, అతడి తల్లిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసి మహేంద్రబాబు, అతని తల్లి లక్ష్మిదేవిలను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Next Story
Share it