కోనసీమ జిల్లాలో విషాదం.. భార్య మృతి చెందడంతో భర్త ఆత్మహత్య

Husband allegedly commits suicide after death of wife in Konaseema district. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణంలోని కొంకపల్లిలో ఆదివారం

By అంజి
Published on : 19 Dec 2022 1:20 PM IST

కోనసీమ జిల్లాలో విషాదం.. భార్య మృతి చెందడంతో భర్త ఆత్మహత్య

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణంలోని కొంకపల్లిలో ఆదివారం తెల్లవారుజామున అనారోగ్యంతో భార్య మృతి చెందడంతో భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. పట్టణ ఇన్ ఛార్జి సీఐ వీరబాబు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కొంకపల్లిలోని ఇంట్లో భార్యభర్తలు బోనం తులసీలక్ష్మి(45), శ్రీరామ విజయ కుమార్ (47) నిమిషాల వ్యవధిలో మృతి చెందారు.ఓఎన్‌జీసీ సబ్‌ కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్న విజయ కుమార్‌ ఇటీవల ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నాడు. భార్య తులసిలక్ష్మి మూడు నెలల కిందటే బ్రెయిన్ సర్జరీ చేయించుకుని అనారోగ్యంతో బాధపడుతోంది.

శనివారం రాత్రి ఇద్దరూ ఇంట్లో నిద్రించారు. తెల్లవారుజామున తులసిలక్ష్మి బెడ్‌రూమ్‌లోని బెడ్‌పై శవమై పడి ఉంది. అప్పటికే ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న అతడికి భార్య మరణం మరింత బాధను కలిగించింది. దీంతో మనస్తాపం చెంది ఇంటి రెండో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వీరి కుమారుడు కృష్ణ విజయవాడలో ఇంటర్ చదువుతున్నాడు. తల్లిదండ్రుల మరణ వార్త విని విజయవాడ నుంచి హఠాత్తుగా వచ్చాడు. తులసిలక్ష్మి తండ్రి గోవిందు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వీరబాబు తెలిపారు.

Next Story