Andhrapradesh: దీపం 2 పథకానికి భారీ స్పందన.. రికార్డు స్థాయిలో గ్యాస్ బుకింగ్స్

దీపం-2.0 పథకం కింద మహిళల జీవితాల్లో వెలుగులు నింపేలా కూటమి ప్రభుత్వం చేపట్టిన ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీకి భారీ స్పందన లభిస్తోంది.

By అంజి  Published on  5 Nov 2024 7:48 AM IST
Deepam 2.0 scheme, APnews, gas cylinder bookings

Andhrapradesh: దీపం 2 పథకానికి భారీ స్పందన.. రికార్డు స్థాయిలో గ్యాస్ బుకింగ్స్

అమరావతి: దీపం-2.0 పథకం కింద మహిళల జీవితాల్లో వెలుగులు నింపేలా కూటమి ప్రభుత్వం చేపట్టిన ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీకి భారీ స్పందన లభిస్తోంది. దీపావళి కానుకగా లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించే కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టగా.. ఇప్పటివరకు (04.11.2024 తేదీ వరకు) మొత్తం 16,82,646 సిలిండర్లు బుకింగ్ చేసుకోగా 6,46,350 సిలిండర్లు డెలివరీ చేశారు.

ఇప్పటివరకు సిలిండర్స్ బుక్ చేసుకున్న లబ్ధిదారులకు రూ.38.07 కోట్ల సబ్సిడీ అందించాల్సి ఉండగా.. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రూ.16.97 కోట్ల సబ్సిడీ లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసింది. నిన్న ఒక్కరోజే దీపం-2.0 పథకం కింద 64,980 గ్యాస్ సిలిండర్లు బుక్ కాగా.. 17,313 సిలిండర్లు డెలివరీ చేశారు. ఈ నెల 3 తేదీన ఒక్కరోజే 6,29,037 సిలిండర్లు డెలివరీ చేశారు. ఉచిత గ్యాస్ సిలిండర్ల నిమిత్తం ఏర్పాటు చేసిన 1967 టోల్ ఫ్రీ నంబర్ కు ఇప్పటివరకు 3660 కాల్స్ రాగా వాటికి పరిష్కారం చూపడం జరిగింది.

Next Story