హిందూపురంలో కొనసాగుతున్న బంద్
Hindupur should be the district headquarters of Satya Sai District.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై ఓ
By తోట వంశీ కుమార్ Published on 29 Jan 2022 10:55 AM ISTఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై ఓ వైపు హర్షం వ్యక్తం అవుతుండగా మరో వైపు జిల్లాల ఏర్పాటుకు సంబంధించి పేర్ల మార్పిడి కోసం డిమాండ్లు ఊపందుకున్నాయి. కొత్త జిల్లాల ప్రకటన రాగానే అనంతపురం జిల్లాలో నిరసనలు మిన్నంటాయి. అనంతపురం జిల్లాను రెండుగా విభజిస్తున్నారు. అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలుగా విభజించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే దీనిని హిందూపురం వాసులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. హిందూపురంను జిల్లా కేంద్రం చేయాలని కోరుతూ ఈ రోజు అఖిలపక్షం బంద్‌కు పిలుపునిచ్చింది.
అఖిలపక్ష పార్టీలు చేపట్టిన బంద్ సంపూర్ణంగా కొనసాగుతోంది. ఉదయం నుంచే వ్యాపార వాణిజ్య సముదాయాలను స్వచ్చందంగా మూసివేశారు. బంద్ నేపథ్యంలో ప్రైవేటు పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఆర్టీసీ డిపో వద్దకు చేరుకున్న ఆందోనకారులు బస్సుల రాకపోకలను అడ్డుకున్నారు. డిపో ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఇక ఇప్పటికే హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ జిల్లాల ఏర్పాటుపై తన అభిప్రాయాన్ని చెప్పారు. పరిపాలనా వికేంద్రీకరణ కోసం ప్రభుత్వం తీసుకున్న జిల్లాల పునర్వ్యస్థీకరణ నిర్ణయాన్ని స్వాగతించిన బాలకృష్ణ.. వ్యాపార పరంగా, వాణిజ్య పరంగా, పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన హిందూపురాన్ని సత్యసాయి జిల్లాలో జిల్లా కేంద్రం చేయాలని డిమాండ్ చేశారు.