ఆంధ్రప్రదేశ్‌లో ఆలయాలపై దాడులు, విగ్రహాల విధ్వంసం రాజకీయ వివాదంగా ముదురుతోంది. ఇటీవల రాముడి విగ్రహం తలను తొలగించిన ఘటనతో రామతీర్థంలో ఉద్రిక్త వాతావరణ ఏర్పడింది. రామతీర్థం కొండపైకి ర్యాలీగా వెళ్లేందుకు బీజేపీ నేతలు యత్నిస్తున్నారు. నెల్లిమర్ల జంక్షన్‌ దగ్గర బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులతో బీజేపీ నేతల వాగ్వాదానికి దిగారు. ఈ నేపథ్యంలో ఇరువురి మధ్య తోపులాట జరిగింది. రామతీర్థం కొండపైకి ఐదుగురిని మాత్రమే అనుమతిస్తామని పోలీసులు తెలిపారు.

అయితే.. అందరినీ అనుమతించాలని బీజేపీ నేతలు, కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులను తోసుకుంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు, కార్యకర్తలు ముందుకు వచ్చారు. తోపులాటలో సోమువీర్రాజు సొమ్మసిల్లి పడిపోయారు. పలువురు బీజేపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉద్రిక్త‌త‌ల నేఫ‌థ్యంలో రామతీర్థం పరిసరాల్లో పోలీసులు భారీగా మోహరించారు.సామ్రాట్

Next Story