మాజీ మంత్రి పేర్ని వెంకట రామయ్య(నాని)కి హైకోర్టులో భారీ ఊరట లభించింది. రేషన్ బియ్యం వ్యవహారానకి సంబంధించిన కేసులో ఏ6గా ఉన్న ఆయనకు న్యాయస్థానం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో ఏ1గా పేర్ని నాని భార్య పేర్ని జయసుధ, ఏ2గా మానస్ తేజ్, ఏ3గా కోటిరెడ్డి, ఏ4గా మంగారావు, ఏ5గా బాలాంజనేయులు ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే మచిలీపట్నం పీఎస్ లో పేర్ని జయసుధ విచారణకు హాజరయ్యారు.
ఇదే కేసులో ఇప్పటికే నాని భార్యకు కూడా బెయిల్ వచ్చిన విషయం తెలిసిందే. అలాగే కాకినాడ పోర్టు వాటాల బదలాయింపు వ్యవహారంలో వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డికి కూడా కోర్టు బెయిల్ ఇచ్చింది. కాకినాడ డీప్ వాటర్ పోర్ట్, కాకినాడ సెజ్‌లోని వాటాల బదలాయింపు చట్టనిబంధనల ప్రకారమే జరిగిందని విక్రాంత్‌రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది హైకోర్టులో వాదనలు వినిపించారు.