AP Cabinet: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే
సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
By అంజి Published on 28 Aug 2024 7:01 AM GMTAP Cabinet: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే
అమరావతి: సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రివర్స్ టెండరింగ్ విధానాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి వర్గం రద్దు చేసింది. పాత విధానంలోనే టెండర్లు పిలిచే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పోలవరం ఎడమ కాలువ పనుల పునరుద్ధరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం పనులు చేస్తున్న కాంట్రాక్ట్ సంస్థనే కొనసాగించేందుకు అంగీకరించింది. అలాగే స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో రద్దుకు తీర్మానం చేసింది.
కొత్తగా 2,774 రేషన్ షాపులకు అనుమతి ఇచ్చింది. వివాదాల్లో ఉన్న భూముల రిజిస్ట్రేషన్‌ను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఎక్సైజ్ శాఖ పునర్ వ్యవస్థీకరణ చేయాలని నిర్ణయించింది. పట్టాదారు పాస్‌బుక్‌లపై జగన్ బొమ్మ తొలగింపుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అటు మున్సిసాలిటీల్లో 269 సూపర్ న్యూమరీ పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. త్వరలోనే వీటి భర్తీకి నోటిఫికేషన్ రానుంది.
ఇదిలా ఉంటే.. ఈ సమావేశం నుంచి పేపర్ లెస్.. ఈ-కేబినెట్‌ను కూటమి ప్రభుత్వం ప్రారంభించింది. అజెండా మొదలుకుని నోట్స్ వరకు ఆన్‌లైన్ ద్వారానే మంత్రులకు ఏపీ సర్కార్ అందజేయనుంది.