అనంతపురంలో నిన్న రాత్రి భారీగా వర్షం కురసింది. దీంతో నగరానికి ఆనుకుని ఉన్న పండమేరు వాగుకు వరద ఉధృతి పెరిగింది. వరద ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో వాగుకు ఇరువైపులా ఉన్న కాలనీలు పూర్తిగా నీటమునిగాయి. వరద ప్రవాహం పెరగడంతో ప్రజలు తమను తాము రక్షించుకునేందుకు ఇళ్లపైకి ఎక్కారు. సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. బాధిత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలిస్తున్నారు.
కనగానపల్లి మండలంలోని ముక్తాపురం చెరువు అలుగు భారీగా పారుతోంది. దీంతో నేషనల్ హైవేపైకి వర్షపు నీరు వచ్చి చేరింది. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. స్థానికంగా ఉన్న భారత్ పెట్రోల్ బంక్‌లోకి వర్షపు నీరు వచ్చి చేరింది. కనగానపల్లి చెరువు కట్ట తెగి వరద పండమేరులోకి ఉదృతంగా ప్రవహిస్తోంది. వాగు ఉద్ధృతితో హైదరాబాద్ - బెంగళూరు నేషనల్ హైవేపై రాకపోకలు నిలిచిపోయాయి.