రేపు టెన్త్ హాల్ టికెట్లు విడుదల
ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షల హాల్ టికెట్లు రేపు విడుదల కానున్నాయి. ఉదయం 10 గంటల నుంచి వెబ్‌సైట్‌లో విద్యార్థులు...
By - అంజి |
రేపు టెన్త్ హాల్ టికెట్లు విడుదల
ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షల హాల్ టికెట్లు రేపు విడుదల కానున్నాయి. ఉదయం 10 గంటల నుంచి వెబ్‌సైట్‌లో విద్యార్థులు తమ హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మనమిత్ర వాట్సాప్, లీప్ యాప్‌లోనూ ఈ అవకాశం ఉంటుంది. నామినల్ రోల్స్‌లో విద్యార్థుల పేరు, పుట్టిన తేదీ వంటి వివరాల్లో దొర్లిన తప్పులను సరిదిద్దుకోవడానికి ఫిబ్రవరి 26 - 28 మధ్య అవకాశం ఇచ్చారు. కాగా ఈ నెల 16 నుంచి రాష్ట్రంలో టెన్త్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.
ఆంధ్రప్రదేశ్ పదవ తరగతి (SSC) పబ్లిక్ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు సెకండరీ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కీలక సమాచారాన్ని అందించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కె.వి. శ్రీనివాసులు రెడ్డి ఒక ప్రకటన విడుదల చేస్తూ, విద్యార్థులు తమ హాల్ టికెట్లను అధికారిక మార్గాల ద్వారానే పొందాలని సూచించారు.
బోర్డు సూచించిన మూడు పద్ధతుల్లో మాత్రమే విద్యార్థులు హాల్ టికెట్లను పొందవచ్చు:
అధికారిక వెబ్‌సైట్: www.bse.ap.gov.in
వాట్సాప్ గవర్నెన్స్ (మన మిత్ర సర్వీస్): 9552300009 నంబర్ ద్వారా.
లీప్ (LEAP) యాప్: పాఠశాల విద్యాశాఖకు చెందిన అప్లికేషన్ ద్వారా.
అలాగే, విద్యార్థులు తమ పాఠశాల ప్రధానోపాధ్యాయులను (Headmaster/Headmistress) సంప్రదించి కూడా హాల్ టికెట్లు తీసుకోవచ్చు.