ఒంటి పూట బడులకు వేళాయె.. తెలుసుకోండి
Half Day Schools In AP. ఆంధ్రప్రదేశ్ లో ఒంటి పూట బడులకు సమయం అయింది.
By M.S.R Published on 1 April 2023 3:27 PM ISTప్రతీకాత్మక చిత్రం
ఆంధ్రప్రదేశ్ లో ఒంటి పూట బడులకు సమయం అయింది. ఈ విషయాన్ని మంత్రి బొత్స సత్యనారాయణ ధృవీకరించారు. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ఏప్రిల్ 3 నుంచి ఒక పూటే నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. ఉదయం 7.30 గంటల నుంచి మద్యాహ్నం 12 గంటల వరకూ పాఠశాలలు నడుస్తాయని చెప్పారు.
ఇక ఏపీలో పదో తరగతి పరీక్షలపై కూడా ఆయన స్పందించారు. ఏప్రిల్ 3 నుంచి 18 వరకు పదోతరగతి పరీక్షలు నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని, పరీక్షలు జరిగే 3,349 పాఠశాలల్లో రెండుపూటలా సెలవులు ఉంటాయన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 6 లక్షల 9 వేల 70 మంది విద్యార్ధులు పరీక్షలకు హాజరవుతున్నారని అన్నారు. ఈ ఏడాది నుంచి 6 పేపర్ల విధానంలోనే పరీక్షలు జరుగుతాయని చెప్పారు. హాల్‌టికెట్ ను చూపించి విద్యార్థులు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించొచ్చని అన్నారు.