పోసానికి భారీ ఊర‌ట‌

సినీనటుడు పోసాని కృష్ణ మురళికి గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది

By Knakam Karthik
Published on : 21 March 2025 4:53 PM IST

Andrapradesh, Guntur, Posani Krishna Murali, AP Police, Bail

వారిపై అనుచిత వ్యాఖ్యల కేసులో అరెస్టయిన పోసానికి శుభవార్త

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌లపై అనుచిత వ్యాఖ్యల కేసులో అరెస్టయిన సినీనటుడు పోసాని కృష్ణ మురళికి గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కాగా సీఐడీ కేసులో ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఇప్పటికే పోసానికి బెయిల్ వచ్చినా సీఐడీ పీటీ వారెంట్ తో జైలులోనే అరెస్ట్ చేసి చేసిన కోర్టు.. నెల రోజులుగా నటుడు పోసాని కృష్ణ మురళి నరసారావుపేట జైల్లో రిమాండులో ఉన్నాడు. దీంతో తన ఆరోగ్య సమస్యల కారణాలని దృష్టిలో ఉంచుకుని బెయిల్ మంజూరు చెయ్యాలని కోర్టులో పిటీషన్ దాఖలు చేశాడు. శుక్రవారం గుంటూరు కోర్టు పోసాని కృష్ణ మురళి బెయిల్ పిటిషన్‌ను పరిశీలించి బెయిల్ మంజూరు చేసింది.

కాగా పోసాని కృష్ణ మురళిని ఏపీ పోలీసులు గత నెల 27న అరెస్టు చేశారు. రాయదుర్గంలోని మై హోమ్ భుజ అపార్ట్ మెంట్ లో ఉంటున్న పోసానిని ఏపీలోని రాయచోటి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయనను ఏపీకి తరలించారు. అనంతపురం, నరసరావుపేట, చిత్తూరు, తిరుపతి, కృష్ణ, పశ్చిమగోదావరి, బాపట్ల, అన్నమయ్య జిల్లాల్లో కేసులు నమోదయ్యాయి. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులో పోసానిని పోలీసులు ప్రస్తుతం అరెస్ట్ చేశారు.

Next Story