కడపలో కాల్పుల కలకలం.. ఇద్దరి మృతి
Gun fired at Pulivendula Mandal.కడప జిల్లాలోని పులివెందుల మండలంలో కాల్పులు కలకలం సృష్టించాయి.
By తోట వంశీ కుమార్ Published on 15 Jun 2021 4:07 AM GMT
కడప జిల్లాలోని పులివెందుల మండలంలో కాల్పులు కలకలం సృష్టించాయి. రెండు కుటుంబాల మధ్య చెలరేగిన ఘర్షణల్లో జరిగిన తుపాకీ కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. పార్థసారధి రెడ్డి (48), ప్రసాద్ రెడ్డి (62) ఇరువురు బంధువులు. వీరి కుటుంబాల మధ్య పాత కక్షలు ఉన్నాయి. ఈరోజు ఉదయం ప్రసాద్ రెడ్డి ఇంటి పైకి మచ్చు కత్తి తీసుకొని వెళ్లిన పార్థసారధి రెడ్డి దాడి చేయబోయాడు. తనను చంపుతాడెమో అన్న ఆందోళనతో ప్రసాద్ రెడ్డి తన దగ్గర ఉన్న లైసెన్స్ తుపాకీతో పార్థసారధి రెడ్డిపై కాల్పులు జరిపాడు. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు
దీంతో ఘటనా స్ధలంలోనే పార్దసారధి రెడ్డి మృతి చెందాడు. అనంతరం ప్రసాద్‌రెడ్డి అదే తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనలో ఇరువురూ మృతి చెందారు. వ్యక్తిగత గొడవలే ఘటనకు కారణమని స్థానికులు అనుకుంటున్నారు. గత కొంత కాలం ఈ రెండు కుటుంబాల మధ్య ఆస్తి తగదాలు నెలకొన్నాయి. ఇదే అంశంపై చాలా సార్లు గొడవ జరిగినట్లుగా తెలుస్తోంది. ఆస్తి విషయంలో వివాదాలే కాల్పులకు కారణమని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.