నేటి నుంచే గ్రూప్‌-1 మెయిన్స్‌.. ఉదయం 9.45 తర్వాత నో ఎంట్రీ

నేటి నుంచి గ్రూప్‌-1 మెయిన్‌ పరీక్షలను ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్వహించనుంది. ఇవాళ్టి నుంచి మే 9వ తేదీ వరకు గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలు జరగనున్నాయి.

By అంజి
Published on : 3 May 2025 6:37 AM IST

Group-1, Group-1 mains exams, APnews

నేటి నుంచే గ్రూప్‌-1 మెయిన్స్‌.. ఉదయం 9.45 తర్వాత నో ఎంట్రీ

అమరావతి: నేటి నుంచి గ్రూప్‌-1 మెయిన్‌ పరీక్షలను ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్వహించనుంది. ఇవాళ్టి నుంచి మే 9వ తేదీ వరకు గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలు జరగనున్నాయి. విశాఖపట్నంలో 2, విజయవాడ 6, తిరుపతి 3, అనంతపురంలో 2.. మొత్తం 13 ఎగ్జామ్‌ సెంటర్లను ఏర్పాటు చేశారు అధికారులు. 89 పోస్టుల కోసం ప్రిలిమ్స్‌ అర్హత సాధించిన 4,496 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారు. రోజూ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్షలు జరుగుతాయి.

పరీక్షా కేంద్రంలోకి ఉదయం 9.45 గంటల్లోపే అనుమతి ఇస్తారు అభ్యర్థులు ఏదైనా గుర్తింపు కార్డు, హాల్ టికెట్‌, బ్లూ లేదా బ్లాక్‌ బాల్‌ పాయింట్‌ పెన్‌ మాత్రమే వెంట తీసుకెళ్లాలని అధికారులు సూచించారు. ఇవాళ తెలుగు క్వాలిఫైయింగ్‌ నేచర్‌ (తెలుగు), 4వ తేదీన క్వాలిఫైయింగ్‌ నేచర్‌(ఇంగ్లీష్‌), 5వ తేదీన పేపర్‌-1, 6వ తేదీన పేపర్‌-2, 7వ తేదీన పేపర్‌-3, 8వ తేదీన పేపర్‌-4, 9వ తేదీన పేపర్‌-5 పరీక్షలు జరుగుతాయి.

Next Story