ప్రతి మండలం లోనూ ప్రభుత్వ జూనియర్ కాలేజీని తీసుకొస్తాం: మంత్రి నారా లోకేష్

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఇంటర్మీడియట్ కళాశాలల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు.

By అంజి  Published on  6 Nov 2024 5:00 AM GMT
Government Junior College, mandal, Minister Nara Lokesh, APnews

ప్రతి మండలం లోనూ ప్రభుత్వ జూనియర్ కాలేజీని తీసుకొస్తాం: మంత్రి నారా లోకేష్ 

అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఇంటర్మీడియట్ కళాశాలల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి మండలంలో ఇంటర్మీడియట్ కళాశాల ఏర్పాటుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు.

ఉండవల్లిలోని తన నివాసంలో ఇంటర్మీడియట్ విద్యపై అధికారులతో నిర్వహించారు నారా లోకేష్. ప్రభుత్వ ఇంటర్మీడియట్ కళాశాలల్లో విద్యార్థుల ఫలితాలపై కూడా దృష్టి సారించాలన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఉత్తీర్ణత శాతం ప్రైవేట్ కళాశాలలతో సమానంగా ఉండాలని తెలిపారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదివి ఐఐటీ, మెడిసిన్ వంటి పోటీ పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థుల ఫొటోలను వార్తాపత్రికల్లో ప్రచురించాలని అధికారులను లోకేష్ సూచించారు.

ఇంటర్మీడియట్ విద్యార్థుల జవాబు పత్రాలను ఏఐని ఉపయోగించి మూల్యాంకనం చేయాలని అధికారులకు సూచించారు. మారుమూల ప్రాంతాల్లో జూనియర్ కాలేజీలు ఏర్పాటు చేసే వారికి త్వరగా అనుమతులు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్య పుస్తకాలను ప్రవేశపెట్టాలన్నారు.

Next Story