రాజ‌మండ్రిలో ప‌ట్టాలు త‌ప్పిన గూడ్స్ రైలు.. 9 రైళ్లు ర‌ద్దు

Goods Train derailed near Rajahmundry Railway station.రాజ‌మండ్రి రైల్వే స్టేష‌న్ స‌మీపంలో గూడ్స్ రైలు ప‌ట్టాలు త‌ప్పింది

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 Nov 2022 8:55 AM IST
రాజ‌మండ్రిలో ప‌ట్టాలు త‌ప్పిన గూడ్స్ రైలు.. 9 రైళ్లు ర‌ద్దు

తూర్పుగోదావ‌రి జిల్లా రాజ‌మండ్రి రైల్వే స్టేష‌న్ స‌మీపంలో గూడ్స్ రైలు ప‌ట్టాలు త‌ప్పింది. దీంతో ప‌లు రైళ్ల రాక‌పోక‌లకు అంత‌రాయం ఏర్ప‌డింది. ఐఎల్టీడీ ఫ్లైఓవర్‌ వద్ద బుధ‌వారం తెల్ల‌వారుజామున 3 గంట‌ల ప్రాంతంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. దీంతో ప‌లు రైళ్ల‌ను ర‌ద్దు చేసిన‌ట్లు అధికారులు తెలిపారు. స‌మాచారం అందుకున్న వెంట‌నే రైల్వే సిబ్బంది అక్క‌డ‌కు చేరుకుని మ‌ర‌మ్మ‌తులు చేప‌ట్టారు. దీంతో ఒకే ట్రాక్‌పై రైళ్ల రాక‌పోక‌లు కొన‌సాగుతున్నాయి.


గూడ్స్ రైలు ప‌ట్టాలు త‌ప్ప‌డంతో 9 రైళ్ల‌ను పూర్తిగా రెండు రైళ్ల‌ను పాకిక్షంగా ర‌ద్దు చేసిన‌ట్లు ద‌క్షిణ‌మ‌ధ్య రైల్వే తెలిపింది.

ర‌ద్దు అయిన రైళ్ల వివ‌రాలు ఇవే..




Next Story