నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్ న్యూస్.. త్వరలోనే 18 జాబ్‌ నోటిఫికేషన్లు

నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. ఎస్సీ వర్గీకరణ అమల్లోకి రావడంతో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం సిద్ధమైంది.

By అంజి
Published on : 23 April 2025 6:58 AM IST

unemployed, APPSC, job notifications, APnews

నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్ న్యూస్.. త్వరలోనే 18 జాబ్‌ నోటిఫికేషన్లు

అమరావతి: నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. ఎస్సీ వర్గీకరణ అమల్లోకి రావడంతో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం సిద్ధమైంది. త్వరలోనే 18 నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) సిద్ధంగా ఉన్నట్టు వివరించింది. ఎస్సీ వర్గీకరణకు తగ్గట్టు రోస్టర్‌ పాయింట్లు ఉంటాయని చెప్పింది. ఎస్సీ వర్గీకరణకు రోస్టర్ పాయింట్లు ఇంకా ఖరారు చేయాల్సి ఉంది. ఈ 18 నోటిఫికేషన్లకు సంబంధించి ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో 866 పోస్టులు భర్తీ చేయనున్నట్టు సమాచారం. ఇటీవల ప్రభుత్వం మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే.

శాఖల వారీగా పోస్టుల వివరాలు

అటవీ శాఖలో మొత్తం పోస్టులు - 814

సెక్షన్ ఆఫీసర్ - 100 (30 పోస్టులు క్యారీ ఫార్వర్డ్)

బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ ఆఫీసర్- 691 (141 క్యారీ ఫార్వర్డ్)

డ్రాఫ్ట్స్ మెన్ గ్రేడ్-2

టెక్నికల్ అసిస్టెంట్- 13

తన్నేదార్: 10

ఇతర శాఖల్లో ఖాళీలు

అగ్రికల్చర్ ఆఫీసర్ (వ్యవసాయ శాఖ) - 10

ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (దేవాదాయ) -7

జిల్లా సైనిక్ అధికారి -7

అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ (మత్స్యకార శాఖ)- 3

టెక్నికల్ అసిస్టెంట్ (భూగర్భ నీటిపారుదల) - 4

జూనియర్ ఎకౌంట్స్ ఆఫీసర్ కేటగిరీ-2,

సీనియర్ ఎకౌంటెంట్ కేటగిరీ-3,

జూనియర్ ఎకౌంటెంట్ కేటగిరీ-4 (మున్సిపల్)- 11

అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ - 1 (క్యారీ ఫార్వర్డ్)

జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్-1 (ప్రిజన్స్) - 1 (క్యారీ ఫార్వర్డ్)

గ్రంథ పాలకుడు (ఇంటర్ విద్య)- 2

Next Story