ఏపీ ప్ర‌జ‌ల‌కు గుడ్‌న్యూస్‌.. దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్లు

దీపావళి పండగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కూటమి ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. అక్టోబర్ 31న దీపావళి సందర్భంగా మహాశక్తి పథకాన్ని ప్రారంభిస్తామని నాదెండ్ల మనోహర్ తెలిపారు

By Kalasani Durgapraveen  Published on  20 Oct 2024 6:17 PM IST
ఏపీ ప్ర‌జ‌ల‌కు గుడ్‌న్యూస్‌.. దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్లు

దీపావళి పండగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కూటమి ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. అక్టోబర్ 31న దీపావళి సందర్భంగా మహాశక్తి పథకాన్ని ప్రారంభిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ పథకంలో భాగంగా ప్రభుత్వం ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇవ్వనుందన్నారు. ఈ పథకం అమలుకు అధికారులు కసరత్తు చేస్తున్నారన్నారు. ప్రస్తుతం 1.55 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి తెలిపారు. తెల్లరేషన్ కార్డుదారులు 1.47 కోట్ల మంది ఉన్నారు. వీరికి సంవత్సరం 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తే రూ. 3640 కోట్లకు పైగా ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేశారు .

దీపావళి సందర్భంగా ప్రతి ఇంట్లో పండుగ వెలుగులు తీసుకొస్తామని అన్నారు. దీపావళి నుండి దీపం పథకంలో ఉన్న పేద కుటుంబాలకు మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వబోతున్నామని తెలిపారు. ఉచిత గ్యాస్ సిలిండర్ పథకానికి.. సంవత్సరానికి మూడు వేల కోట్లు ఖర్చు పెట్టబోతున్నాం అన్నారు. కూటమి ప్రభుత్వంలో మంచి జరుగుతుందని మహిళలు పెద్ద ఎత్తున ఆశీర్వదించారన్నారు. అందుకే వారిని ఆశీర్వదించడానికి.. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సూపర్ సిక్స్ పథకాల అమలుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మనోహర్ తెలిపారు.

Next Story