నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. నేడే డీఎస్‌సీ నోటిఫికేషన్‌!

ఏపీ నిరుద్యోగులకు శుభవార్త. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు మంత్రి బొత్స సత్యనారాయణ డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారని సమాచారం.

By అంజి  Published on  7 Feb 2024 2:09 AM GMT
AP unemployed, DSC notification, APGovt, APnews

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. నేడే డీఎస్‌సీ నోటిఫికేషన్‌!

ఏపీ నిరుద్యోగులకు శుభవార్త. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు మంత్రి బొత్స సత్యనారాయణ డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారని సమాచారం. పరీక్ష నిర్వహణ, విధివిధానాలపై నిన్న విద్యాశాఖ అధికారులతో సమావేశమైన మంత్రి కూలంకషంగా చర్చించారు. త్వరితగతిన నియామక ప్రక్రియ పూర్తి చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. 6,100 టీచర్‌ పోస్టులతో నోటిఫికేషన్‌ విడుదల కానుంది.

వయోపరిమితి పెంచాలనే డిమాండ్‌పై ఏమైనా ప్రకటన ఉంటుందేమో చూడాలి. ఎన్నికల షెడ్యూల్‌తో పాటు ప్రవర్తన నియమావళి కూడా అమల్లోకి వస్తుందని, ఫలితంగా ఖాళీల భర్తీకి చర్యలు తీసుకోవడం కష్టతరమౌతుంది. ఈ నేపథ్యంలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయడంలో ఎలాంటి జాప్యం చేయకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. కాగా ఈసారి కొత్తగా 12ఏళ్ల క్రితం తొలగించిన అప్రెంటిస్‌షిప్‌ విధానాన్ని తిరిగి ప్రవేశ పెట్టనున్నారు.

ఈ డీఎస్సీలో ఎంపికైన టీచర్లు రెండేళ్లపాటు గౌరవవేతనానికి పని చేయాల్సి ఉంటుంది. టెట్‌, డీఎస్సీలకు కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్షల నిర్వహణకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ టీసీఎస్‌తో ఒప్పందం కుదుర్చుకోనుంది. 2018లో చివరిసారిగా డీఎస్సీ నిర్వహించారు. మొత్తం 7,902 పోస్టులకు ప్రకటన ఇవ్వగా.. 6.08 లక్షల దరఖాస్తులు వచ్చాయి.

Next Story