ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్
డీబీటీ పథకాలకు నిధుల విడుదలకు ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
By M.S.R
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్
డీబీటీ పథకాలకు నిధుల విడుదలకు ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఏపీలోని పలువురు లబ్ధి దారుల అకౌంట్లలోకి డబ్బులు పడనున్నాయి. జగనన్న ఆసరాకు రూ.1480 కోట్లు, జగనన్న విద్యా దీవెన కింద రూ.502 కోట్ల నిధులు విడుదల అయ్యాయి. లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదు బదిలీ చేయవచ్చని జవహర్ రెడ్డికి ఎన్నికల కమీషన్ ఆదేశాలు జారీ చేసింది. టీడీపీ ఫిర్యాదులతో పోలింగ్కు ముందు డీబీటీ కింద నిధుల విడుదలను సీఈఓ ముఖేష్ కుమార్ మీనా నిలిపివేశారు. మే 13న పోలింగ్ ముగిసిన తరువాత నిధుల విడుదలకు ఈసీ ఆమోదం తెలిపింది. దీంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఈసీ ఆదేశాల మేరకు మే 15న ఆసరా, జగనన్న విద్యా దీవెన, సంపూర్ణ ఫీజు రీఎంబర్స్మెంట్ కింద రూ. 1982 కోట్ల రూపాయలు నగదు లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేసింది. మిగిలిన పథకాలకు సంబంధించిన లబ్ధిదారులకు కూడా రెండు, మూడు రోజుల్లో డీబీటీ విధానం ద్వారా నిధులు విడుదల చేయనున్నారు.