కడప జిల్లాలో కలకలం.. దేవుళ్ల విగ్రహాలు ధ్వంసం..!
God idols Vandalised in Railway Kodur.ఆ మధ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసం చేసిన
By తోట వంశీ కుమార్ Published on
27 March 2021 11:04 AM GMT

ఆ మధ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసం చేసిన ఘటనలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. పలు ఉద్రిక్త ఘటనలు చోటుచేసుకున్నాయి. అయితే.. ఏపీ ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టడంతో ఆ తరువాత అలాంటి ఘటనలు వెలుగుచూడలేదు. తాజాగా మరోసారి దేవుళ్ల విగ్రహాలు ధ్వంసం చేయడం ఆందోళనకు గురి చేస్తోంది. ఈ ఘటన కడప జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. రైల్వేకోడూరు టోల్ ప్లాజా వద్ద ఉన్న విగ్రహాలను దుండగులు ధ్వంసం చేశారు. రాముడు, సీతతో పాటు ఆంజనేయస్వామి విగ్రహాలను ధ్వంసం చేశారు.
ఇక ఈ విగ్రహాల ధ్వంసం గురించి తెలిసిన వెంటనే హిందూ సంఘాలు ఆందోళనకు దిగాయి. మరోవైపు ఘటన నేపథ్యంలో ఒక యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే.. గత కొంతకాలంగా ఎలాంటి విగ్రహాలు ధ్వంసం కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్న పోలీసులను.. ఇప్పుడు తాజా కేసు మళ్లీ టెన్షన్ పెడుతోంది.
Next Story