ఏపీలో మరో దారుణం..ప్రియుడిపై కోపంతో ఇంటికి నిప్పంటించిన ప్రియురాలు
గుంటూరు జిల్లా చేబ్రోలు మండలంలో దారుణం జరిగింది.
By - Knakam Karthik |
ఏపీలో మరో దారుణం..ప్రియుడిపై కోపంతో ఇంటికి నిప్పంటించిన ప్రియురాలు
గుంటూరు జిల్లా చేబ్రోలు మండలంలో దారుణం జరిగింది. ప్రియుడిపై కోపంతో ఓ ప్రియురాలు ఇంటికి నిప్పు పెట్టింది. తెనాలికి చెందిన దుర్గ (28) అనే యువతి, సుద్దపల్లి గ్రామానికి చెందిన మల్లేష్ (30) తో వివాహేతర సంబంధం కలిగి ఉంది. ఇద్దరి మధ్య మనస్పర్థలు ఏర్పడడంతో కోపం పెంచుకున్న దుర్గ పెట్రోల్ పోసి మల్లేష్ ఇంటికి నిప్పంటించింది. ఆ సమయంలో ఇంట్లో మల్లేష్ భార్య, కుమారుడు, తల్లి ఉన్నారు. మంటలు చూసిన గ్రామస్తులు ఆర్పడానికి ప్రయత్నించగా వారు కూడా స్వల్పగాయాలపాలయ్యారు.
ఈ ఘటనలో మల్లేష్, అతని తల్లి, భార్య, కుమారుడితో పాటు ప్రియురాలు దుర్గకు కూడా గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిన్న(శనివారం) కర్నూలులో ఓ ప్రియురాలు తన ప్రియుడి భార్యకు హెచ్ఐవీ వైరస్ ఇంజక్షన్ ఇచ్చిన ఘటన జరిగిన విషయం తెలిసిందే. ఇది జరిగిన తరువాతి రోజే ప్రియుడి ఇంటికి ప్రియురాలు నిప్పు పెట్టడం చర్చనీయాంశంగా మారింది.