టీడీపీ, జనసేన ట్రోల్స్‌ వల్లే గీతాంజలి ఆత్మహత్య: వైసీపీ

తెనాలిలో గీతాంజలి అనే మహిళ ఆత్మహత్య చేసుకోవడం అత్యంత బాధాకరమని అధికార వైఎస్‌ఆర్‌సీపీ పేర్కొంది.

By అంజి
Published on : 12 March 2024 6:45 AM IST

Geetanjali, suicide, TDP, Janasena, trolls, YCP

టీడీపీ, జనసేన ట్రోల్స్‌ వల్లే గీతాంజలి ఆత్మహత్య: వైసీపీ

తెనాలిలో గీతాంజలి అనే మహిళ ఆత్మహత్య చేసుకోవడం అత్యంత బాధాకరమని అధికార వైఎస్‌ఆర్‌సీపీ పేర్కొంది. ఇటీవలే గీతాంజలి తనకు జగనన్న కాలనీలో ఇళ్లు మంజూరు కావడం పట్ల, అమ్మఒడి పథకం ద్వారా లబ్ధి పొందడం పట్ల ఆనందం వ్యక్తం చేయడాన్ని భరించలేని టీడీపీ, జనసేన కార్యకర్తలు ఆమెను కాకుల్లా పొడిచి ఆమెను సోషల్ మీడియాలో ట్రోల్స్ చేసి, హింసించి చివరికి తను ఆత్మహత్య చేసుకునేలా చేశారని ఆరోపించింది. గీతాంజలి ఆత్మహత్యకు కారకులైన వారిపై చట్టం కఠిన చర్యలు తీసుకుంటుందని పేర్కొంది.

గీతాంజలి కుటుంబానికి అన్ని విధాలా పార్టీ అండగా నిలుస్తుందని, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్టు వైసీపీ తెలిపింది. #JusticeForGeethanjali అంటూ వైసీపీ తన అధికారిక ఎక్స్‌ ఖాతాలో పోస్ట్‌ చేసింది. ఇదిలా ఉంటే.. సోషల్ మీడియా వేధింపులు తట్టుకోలేక యువతి గీతాంజలి ఆత్మహత్య చేసుకుంది. రెండు రోజుల పాటు ఆసుపత్రిలో మరణంతో పోరాడి ఇవాళ చనిపోయింది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని #JusticeForGeethanjali #WeStandWithGeethanjali అనే యాష్ ట్యాగ్ లతో ఆమెకు మద్దతుగా నెట్టింట పోస్టులు పెడుతున్నారు.

Next Story