Andhrapradesh: ఉచిత గ్యాస్‌ సిలిండర్‌ బుకింగ్స్‌ ప్రారంభం

అమరావతి: ఉచిత గ్యాస్‌ సిలిండర్‌ పథకానికి సంబంధించి బుకింగ్స్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది.

By అంజి
Published on : 29 Oct 2024 1:06 PM IST

Free gas cylinder, cylinder bookings, Andhra Pradesh

Andhrapradesh: ఉచిత గ్యాస్‌ సిలిండర్‌ బుకింగ్స్‌ ప్రారంభం

అమరావతి: ఉచిత గ్యాస్‌ సిలిండర్‌ పథకానికి సంబంధించి బుకింగ్స్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఎల్లుండి నుంచి అమలయ్యే ఈ పథకానికి నాలుగు నెలలకు ఒకటి చొప్పున ఏడాదికి 3 సిలిండర్లను లబ్ధిదారులకు ప్రభుత్వం అందజేయనుంది. తొలి విడత చెల్లింపుల్లో భాగంగా ఇప్పటికే ప్రభుత్వం రూ.895 కోట్లు విడుదల చేసింది. డీబీటీ విధానంలో ఉచిత సిలిండర్‌ నగదును లబ్ధిదారుని ఖాతాలో జమ చేయనుంది.

ఉచిత సిలిండర్‌ కోసం పాత విధానంలోనే గ్యాస్‌ ఏజెన్సీ నంబర్‌కు మిస్డ్‌ కాల్‌ ఇచ్చి గ్యాస్‌ బుక్‌ చేసుకోవచ్చు. ఆయిల్‌ కంపెనీ యాప్‌లోనూ బుక్ చేసుకోవచ్చు. ఇప్పటికే ఆధార్‌ కార్డు, రేషన్‌ కార్డు, బ్యాంక్‌ ఖాతాలు లింక్‌ అయిన గ్యాస్‌ వినియోగదారులకు సబ్సిడీ సొమ్ము అకౌంట్లలో జమ అవుతుంది. బుక్‌ చేయగానే లింక్‌ అయిన నంబర్‌కు మెసేజ్‌ వస్తుంది. సిలిండర్‌ తీసుకునేటప్పుడు డబ్బు చెల్లిస్తే 48 గంటల్లో అంతే మొత్తం ఖాతాల్లో డిపాజిట్‌ చేస్తారు.

Next Story