గుడ్‌న్యూస్‌.. వరద ప్రభావిత ప్రాంతం నుంచి ఉచిత బస్సు సర్వీసులు

ఇప్పుడిప్పుడే వరద ప్రవాహం తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో వరద ప్రభావిత ప్రాంతమైన అజిత్ సింగ్ నగర్ నుంచి ఉచిత బస్సు సర్వీసులను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది

By Medi Samrat  Published on  4 Sept 2024 9:58 PM IST
గుడ్‌న్యూస్‌.. వరద ప్రభావిత ప్రాంతం నుంచి ఉచిత బస్సు సర్వీసులు

ఇప్పుడిప్పుడే వరద ప్రవాహం తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో వరద ప్రభావిత ప్రాంతమైన అజిత్ సింగ్ నగర్ నుంచి ఉచిత బస్సు సర్వీసులను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. అజిత్ సింగ్ నగర్ నుంచి విజయవాడలోని పలు ప్రాంతాలకు చేరుకునేలా ఆరు బస్సులను ఏర్పాటు చేసింది. గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా ఏపీఎస్ఆర్టీసీ అధికారుల పర్యవేక్షణలో సజావుగా బస్సు సర్వీసులు నడుస్తున్నాయి. ఆహారం సరఫరా, వైద్య సేవలు, మంచినీటి సరఫరా, మందులు అందించడం.. తదితర అంశాలపై ఎప్పటికప్పుడు ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవడంతో పాటు ముఖ్యమంత్రి మార్గదర్శకాలకు అనుగుణంగా బాధితుల సంక్షేమానికి సంబంధించి ప్రతి చిన్నవిషయాన్ని అర్థం చేసుకుంటూ, అవసరాలను తెలుసుకుంటూ యుద్ధప్రాతిపదికన ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ముంపు ప్రభావం వల్ల ఎవరూ ఎలాంటి ఇబ్బందులు పడకూడదనేది ప్రభుత్వ లక్ష్యం. ఇందులో భాగంగానే తాజాగా ప్రభుత్వం ఉచిత బస్సు సర్వీసులను ఏర్పాటు చేసింది.

Next Story