సినిమాకు వెళ్లారని ఉపాధ్యాయుల మంద‌లింపు.. న‌లుగురు విద్యార్థుల అదృశ్యం

Four Students Missing in Guntur District.ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో న‌లుగురు విద్యార్థుల మిస్సింగ్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  7 Dec 2021 10:37 AM IST
సినిమాకు వెళ్లారని ఉపాధ్యాయుల మంద‌లింపు.. న‌లుగురు విద్యార్థుల అదృశ్యం

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో న‌లుగురు విద్యార్థుల మిస్సింగ్ క‌ల‌క‌లం రేపుతోంది. వివ‌రాల్లోకి వెళితే.. రాజీవ్ గృహ‌క‌ల్ప‌లో నివాసం ఉండే వెంక‌ట్‌, ప్ర‌భుదేవా, సంతోష్, వెంకీ అనే న‌లుగురు విద్యార్థులు మంగ‌ళ‌గిరి టిప్ప‌ర్ల బజార్‌లో గ‌ల మున్సిప‌ల్ పాఠ‌శాల‌లో చ‌దువుతున్నారు. నిన్న ఉద‌యం(సోమ‌వారం) య‌ధావిధిగా వారు పాఠ‌శాల‌కు వ‌చ్చారు. బ్యాగులు పాఠ‌శాల‌లో ఉంచిన విద్యార్థులు ఎవ్వ‌రికి చెప్ప‌కుండా అఖండ సినిమాకు వెళ్లారు.

సినిమా చూసిన అనంత‌రం సాయంత్రం బ్యాగులు తీసుకునేందుకు పాఠ‌శాల‌కు వ‌చ్చారు. ఈ విష‌యాన్ని గ‌మ‌నించిన ఉపాధ్యాయుల‌ను విద్యార్థుల‌ను మంద‌లించారు. ఇంకోసారి ఇలాంటివి చేయ‌కూడ‌ద‌ని చెప్పారు. త‌ల్లిదండ్రుల‌కు పిలుచుకుని రావాల‌ని విద్యార్థుల‌కు సూచించారు. ఈ విష‌యం త‌ల్లిదండ్రుల‌కు తెలిస్తే త‌మ‌ను మంద‌లిస్తారని విద్యార్థులు భ‌య‌ప‌డిపోయారు. పాఠ‌శాల నుంచి బ్యాగులు తీసుకుని ఇంటికి బ‌య‌లుదేరారు. కానీ ఇంటికి వెళ్ల‌లేదు. భ‌యంతో ఎక్కడికో వెళ్లిపోయారు. పిల్ల‌ల ఆచూకీ కోసం త‌ల్లిదండ్రులు ఎంత వెతికినా ల‌భ్యం కాలేదు. దీంతో వారు పోలీసుల‌ను ఆశ్ర‌యించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Next Story