Annamaya District: రెండు కార్లు ఢీ.. నలుగురు మృతి, ముగ్గురికి గాయాలు

అన్నమయ్య జిల్లా రామాపురం మండలం నల్లగుట్టపల్లి పంచాయతీ కొత్తపల్లి క్రాస్ వద్ద చిత్తూరు -కడప జాతీయ రహదారిపై శనివారం

By అంజి
Published on : 16 April 2023 11:26 AM IST

Annamaya district, Car accident, APnews

Annamaya District: రెండు కార్లు ఢీ.. నలుగురు మృతి, ముగ్గురికి గాయాలు

అన్నమయ్య జిల్లా రామాపురం మండలం నల్లగుట్టపల్లి పంచాయతీ కొత్తపల్లి క్రాస్ వద్ద చిత్తూరు -కడప జాతీయ రహదారిపై శనివారం అర్ధరాత్రి రెండు కార్లు ఢీకొన్న ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకెళితే.. వైఎస్ఆర్ జిల్లా బద్వేల్ కు చెందిన పెనమల లక్ష్మమ్మ(65) పక్షవాతంతో బాధపడుతుండడంతో కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స నిమిత్తం కారులో చిత్తూరు జిల్లా విరూపాక్షపురం తీసుకువెళ్తున్నారు. కొత్తపల్లి క్రాస్ వద్ద ఎదురుగా వస్తున్న మరో కారు వీరి వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లక్ష్మమ్మతో పాటు ఆమె కుమారుడు నర్సయ్య(41), కారు డ్రైవర్ రాజారెడ్డి(35) అక్కడికక్కడే మృతి చెందారు. కారులో ఉన్న వారి బంధువులు చిన్నక్క(60), బాలుడు హర్షవర్ధన్‌లు తీవ్రంగా గాయపడగా చిన్నక్క కడప రిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి చెందింది. రాయచోటి వైపు నుంచి కడపకు వెళ్తున్న మరో కారులో ముగ్గురు ప్రయాణికులు గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను కడప రిమ్స్‌కు తరలించారు. ప్రమాద స్థలాన్ని రాయచోటి డీఎస్పీ శ్రీధర్‌ పరిశీలించారు.

Next Story