ఘోర రోడ్డు ప్ర‌మాదం.. మినీట్రక్ డోర్ విరిగి నలుగురు మృతి

Four died in Road accident in Prakasam.ప్ర‌కాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటుచేసుకుంది. వేగంగా వెలుతున్న

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 Aug 2021 9:21 AM IST
ఘోర రోడ్డు ప్ర‌మాదం.. మినీట్రక్ డోర్ విరిగి నలుగురు మృతి

ప్ర‌కాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటుచేసుకుంది. వేగంగా వెలుతున్న ఆటో(మినీట్ర‌క్‌) నుంచి జారీ ప‌డి న‌లుగురు దుర్మ‌ర‌ణం చెందారు. ఈ ఘ‌ట‌న త‌ర్లుపాడు-కొన‌క‌మిట్ల మండ‌లాల స‌రిహ‌ద్దు క‌లుజువ్వ‌ల‌పాడు జాతీయ ర‌హ‌దారిపై చోటు చేసుకుంది. పెద్దారవీడు మండలం సోమేపల్లి నుండి పొదిలి మండలం అక్కచెరువుకు పెళ్లి కుమార్తెను తీసుకుని వివాహానికి వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది. వ‌ధువు ఆటో ముందు భాగంలో కూర్చోవ‌డం వ‌ల్ల ఆమెకు ఎటువంటి ప్ర‌మాదం జ‌రుగ‌లేదు.

వెన‌క ఉన్న ఆటో డోర్ విరిగిపోవ‌డంతో వెనుక కూర్చున్న వారు రోడ్డుపై ప‌డిపోయారు. ఈ ఘ‌ట‌న‌లో న‌లుగురు అక్క‌డిక్క‌డే మృతి చెంద‌గా.. మ‌రో ప‌ది మందికి తీవ్ర‌గాయాల‌య్యాయి. స‌మాచారం అందుకున్న పోలీసులు వెంట‌నే అక్క‌డికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. మృతుల‌ను కార్తీక్ (14), కనకం అనిల్( 12), బోగోలు సుబ్బారావు (40), కొంగరి శ్రీనివాసులు (50)గా గుర్తించారు. మృత‌దేహాల‌ను పోస్టుమార్టం నిమిత్తం మార్కాపురం ఏరియా ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. దీనిపై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ఈ ప్ర‌మాదం కార‌ణంగా పెళ్లింట విషాదం నెల‌కొంది.

Next Story