మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నాయకుడు, నారాయణ విద్యాసంస్థల అధినేత నారాయణను ఆంధ్రప్రదేశ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదారాబాద్ కొండాపూర్‌లోని ఆయన నివాసానికి మంగళవారం ఉదయం ఏపీ సీఐడీ పోలీసులు వచ్చి నారాయణను అదుపులోకి తీసుకుని ఆంధ్రప్రదేశ్ కి తరలించారు. ఏపీ రాష్ట్రంలో పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి ప్రశ్నపత్రాలు వరుసగా లీక్ అయిన సంగతి తెలిసిందే. చిత్తూరు జిల్లాలో నారాయణ పాఠశాల నుంచి టెన్త్ పేపర్లు లీకైనట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటికే వైస్ ప్రిన్సిపల్ గిరిధర్‌తో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. తాజాగా ఈ కేసులోనే మాజీ మంత్రి నారాయణను అరెస్టు చేశారు.