అమరావతి: పోలీసులను అడ్డుపెట్టుకుని టీడీపీ రాజకీయాలు చేస్తోందని మాజీ మంత్రి అనిల్ కుమార్ ఆరోపించారు. 'కూటమి ప్రభుత్వ అరాచక పాలన తారాస్థాయికి చేరింది. మంత్రి నారాయణ దిగజారి రాజకీయాలు చేస్తున్నారు. మా పార్టీతో సంబంధం లేని మేయర్‌పై అవిశ్వాసం పెట్టి వైఎస్‌ఆర్‌సీపీపై ట్రోల్స్ చేస్తున్నారు. టీడీపీ అధికారంలో ఉండి.. సంఖ్యా బలమున్నా క్యాంపు రాజకీయాలు చేస్తోంది' అని విమర్శించారు.
నెల్లూరులో పోలీసులు నిఘా, భద్రతను పక్కన పెట్టి కార్పొరేటర్లకు డెలివరీ బాయ్ పనులు చేస్తున్నారని అనిల్ కుమార్ ఎద్దేవా చేశారు. నెల్లూరు నగరంలో వైసీపీ బలంగా ఉందని, టీడీపీనే నైతికంగా ఓడిపోయిందని అన్నారు. నెల్లూరు ఐదో డివిజన్ కార్పొరేటర్ రవిచంద్రను కిడ్నాప్ చేశారని, తమ కార్పొరేటర్లను తీసుకున్నంత మాత్రానా తమకు పెద్దగా నష్టమేమి లేదన్నారు. నెల్లూరులో దళారి వ్యవస్థ నడుస్తోందన్నారు. తమ పార్టీకి సంబంధం లేని మేయర్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టి వైసీపీపై ట్రోల్స్ చేయడం విడ్డూరంగా ఉందన్నారు.