రెవెన్యూ రికార్డుల దగ్దం కేసు.. మదనపల్లె మాజీ ఆర్డీఓ అరెస్టు

మదనపల్లె మాజీ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ (RDO) ఎంఎస్ మురళి బెయిల్ పిటిషన్‌ను స్థానిక కోర్టు తిరస్కరించడంతో...

By -  అంజి
Published on : 20 Sept 2025 6:37 AM IST

Former Madanapalle RDO, arrest, burning revenue records

రెవెన్యూ రికార్డుల దగ్దం కేసు.. మదనపల్లె మాజీ ఆర్డీఓ అరెస్టు

అమరావతి: మదనపల్లె మాజీ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ (RDO) ఎంఎస్ మురళి బెయిల్ పిటిషన్‌ను స్థానిక కోర్టు తిరస్కరించడంతో శుక్రవారం ఆయనను తిరుపతి నివాసంలో పోలీసులు అరెస్టు చేశారు. మదనపల్లె సబ్-కలెక్టర్ కార్యాలయంలో కీలకమైన రెవెన్యూ రికార్డులను ఉద్దేశపూర్వకంగా తగలబెట్టారనే ఆరోపణల కేసులో మొదట మురళికి సుప్రీంకోర్టు మొదట బెయిల్ మంజూరు చేసింది. ఆయన అక్టోబర్ 2022 మరియు ఫిబ్రవరి 2024 మధ్య ఆర్డీఓగా పనిచేశారు.

రాష్ట్రంలో ప్రభుత్వం మారిన కొద్దిసేపటికే జూలై 21, 2024న ఈ సంఘటన జరిగింది. ఆ సమయంలో జరిగిన ఒక పెద్ద అగ్నిప్రమాదంలో భూమి లావాదేవీలకు సంబంధించిన కీలకమైన రెవెన్యూ పత్రాలు దగ్ధమయ్యాయి. ఈ కేసును దర్యాప్తు చేసిన క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (CID), ఈ అగ్నిప్రమాదం సాక్ష్యాలను నాశనం చేయడానికి ఉద్దేశపూర్వకంగా చేసిన ప్రయత్నమని తేల్చింది. గురువారం అతని బెయిల్ రద్దు చేయబడిన తర్వాత, CID అధికారులు తిరుపతిలో మురళిని అదుపులోకి తీసుకున్నారు.

Next Story