ఏపీలో బీజేపీకి భారీ షాక్.. కన్నా లక్ష్మీనారాయణ గుడ్ బై
Former Andhra BJP chief Kanna Lakshmi Narayana quits party.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీకి గట్టి షాక్ తగిలింది.
By తోట వంశీ కుమార్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ(బీజేపీ)కి గట్టి షాక్ తగిలింది. సీనియర్ నేత కన్నా లక్ష్మీ నారాయణ బీజేపీకి రాజీనామా చేశారు. ఆయన అనుచరులు కూడా ఆయన బాటలోనే పయనించారు. గుంటూరులోని తన నివాసంలో ముఖ్య అనుచరులతో సమావేశమైన అనంతరం బీజేపీకి కన్నా లక్ష్మీనారాయణ గుడ్ బై చెప్పారు. తన రాజీనామా లేఖను పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు పంపినట్లు వెల్లడించారు.
పార్టీలో జరుగుతున్న పరిణామాలు తనను కలచివేశాయన్నారు. సోము వీర్రాజు అధ్యక్షుడైన తరువాత పార్టీ పరిస్థితులు మారాయన్నారు. పార్టీలో కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. సోము వీర్రాజు వైఖరితోనే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. కొందరు ఓవర్ నైట్ నేత కావాలని ప్రయత్నిస్తున్నారన్నారు. మోదీ మీద నమ్మకం ఉందంటూనే రాష్ట్ర నాయకత్వంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.
పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డాకు రాజీనామా లేఖ పంపించిన కన్నా లక్ష్మీనారాయణ. pic.twitter.com/hulB2KoxoG
— Newsmeter Telugu (@NewsmeterTelugu) February 16, 2023
గత కొద్ది రోజులుగా బీజేపీ రాష్ట్ర నాయ్యకత్వంపై కన్నా లక్ష్మీనారాయణ అసంతృప్తితో ఉన్నారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలను అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లినా సరైన స్పందన లేదన్నది కన్నా వాదన. చాలా రోజులుగా వేచి చూసిన అధిష్టానం నుంచి స్పందన లేకపోడంతోనే రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.
బీజేపీకి రాజీనామా చేసిన కన్నా లక్ష్మీనారాయణ తన భవిష్యత్తు కార్యాచరణ ఏంటీ అనేది త్వరలోనే చెప్పనున్నారు.