Andhrapradesh: చీరలు చోరీ చేసిన ఐదుగురు మహిళలు.. కేసు నమోదు

ఆంధ్రప్రదేశ్‌లోని కడపలో ఓ వస్త్ర దుకాణంలో బట్టలు దొంగిలించినందుకు ఐదుగురు మహిళలపై కేసు నమోదైంది.

By అంజి  Published on  9 Aug 2024 7:32 AM IST
stealing clothes, sarees, Andhra Pradesh, Kadapa

Andhrapradesh: చీరలు చోరీ చేసిన ఐదుగురు మహిళలు.. కేసు నమోదు

ఆంధ్రప్రదేశ్‌లోని కడపలో ఓ వస్త్ర దుకాణంలో బట్టలు దొంగిలించినందుకు ఐదుగురు మహిళలపై కేసు నమోదైంది. దుకాణంలోని సీసీటీవీ ఫుటేజీలో మహిళలు వారు ధరించిన చీరల వెనుక దొంగిలించిన చీరలను దాచిపెట్టారు. వీడియోలో, ఐదుగురు మహిళలు షాప్‌లోకి ప్రవేశించి.. చీరలను చూడటం ప్రారంభించారు. అయితే, ఇద్దరు మహిళలు తమ చీరల లోపల బట్టల పెట్టెలను దాచి ఉంచడం చూడవచ్చు, ఇతరులు వాటిని కవర్ చేశారు.

ఒక స్త్రీ తనకు మరిన్ని బట్టలు చూపించమని దుకాణంలోని సేల్స్‌పర్సన్‌ని అడుగుతుండగా, మరో ఇద్దరు స్త్రీలు తాము ధరించిన చీరల్లో బట్టలు దాచుకోవడం చూడవచ్చు. కొంతసేపటికి ఐదుగురు కలిసి దుకాణం నుంచి వెళ్లిపోయారు. దీంతో దుకాణదారుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దుకాణంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి మహిళలను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు.

Next Story