విశాఖ జిల్లాలో గ్రేహౌండ్స్‌, మావోయిస్టులకు మ‌ధ్య ఎదురుకాల్పులు జ‌రిగాయి. కొయ్యూరు మండ‌లం మంప పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలోని తీగ‌లమెట్ట వ‌ద్ద ఈ తెల్ల‌వారుజామున ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘ‌ట‌న‌లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందిన‌ట్లు తెలుస్తోంది. మావోయిస్టులు ఉన్నార‌న్న స‌మాచారంతో మంప పీఎస్ ప‌రిధిలోని అటవీ ప్రాంతంలో పోలీసులు కూంబింగ్ చేప‌ట్టారు.

ఈ క్ర‌మంలో కూంబింగ్‌ నిర్వహిస్తున్న గ్రేహాండ్స్‌ దళాలకు ఈ తెల్ల‌వారుజామున మావోయిస్టులు తారసపడటంతో ఎదురు కాల్పులు జ‌రిగాయి. గంటపాటు ఎదురు కాల్పులు జరగ్గా చాలామంది మావోయిస్టులు తప్పించుకున్నారని సమాచారం. ఎంత మందిగాయ‌ప‌డ్డారో తెలియాల్సి ఉంద‌ని పోలీసులు చెబుతున్నారు. మంప పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని అటవీ ప్రాంతాన్ని పోలీసులు జల్లెడ పడుతున్నారు. సరిహద్దులో వాహన తనిఖీలనూ ముమ్మరం చేశారు.

తోట‌ వంశీ కుమార్‌

Next Story