వేసవి కాలం వస్తుండడంతో చిత్తూరు జిల్లాలోని శేషాచలం అటవీ ప్రాంతంలో మంటలు చెలరేగాయి. ఎండలు పెరగుతుండడంతో అటవీ ప్రాంతంలో నిప్పు రాజుకుంటోంది. తాజాగా కాకులకోన అటవీ ప్రాంతంలో అగ్నికి ఆహుతి అవుతోంది. గత మూడు రోజులుగా ఈ ప్రాంతంలో మంటలు వ్యాపిస్తున్నాయి. అప్రతమత్తం అయిన తిరుమల తిరుపతి దేవస్థానం అటవీ విభాగం సిబ్బంది బ్లోయర్లు, చెట్ల కొమ్మల సాయంతో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఎండలు ఎక్కువగా ఉండడం, గాలి వీస్తుండడంతో మంటల వ్యాప్తి అధికమవుతోంది. మంటలు చాలా వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. శేషాచలం అటవీ ప్రాంతంలోని వాచ్ టవర్ల ద్వారా అటవీ విభాగం సిబ్బందితో అటవీ విభాగం పర్యవేక్షిస్తున్నారు. మంటలు వ్యాపించిన ప్రదేశానికి చేరుకుని మంటల తీవ్రగా అధికం అవ్వకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.