విజ‌య‌న‌గ‌రం జిల్లా ద‌త్తిరాజేరు మండ‌లం వింద్య‌వాసిలో అర్థ‌రాత్రి ఒక్క‌సారిగా మంట‌లు చెల‌రేగాయి. మంటల ధాటికి ఇంట్లోని సిలిండ‌ర్ పేలింది. దీంతో ప‌క్క‌నే ఉన్న మూడు పూరి ఇళ్ల‌కు కూడా మంట‌లు వ్యాపించాయి. గ‌మ‌నించిన స్థానికులు వెంట‌నే అగ్నిమాప‌క సిబ్బందికి స‌మాచారం అందించారు. వెంట‌నే అక్క‌డికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంట‌ల‌ను అదుపులోకి తెచ్చారు.

అగ్నిప్ర‌మాదానికి గ‌ల కార‌ణాలు తెలియ‌రాలేదు. ఆ స‌మ‌యంలో ఇంట్లో ఎవ‌రూ లేక‌పోవ‌డంతో ఎటువంటి ప్రాణ‌న‌ష్టం వాటిల్ల‌లేదు. అయితే.. సుమారు రూ.9 లక్షల మేర ఆస్తినష్టం సంభవించినట్టు తెలుస్తోంది.కాగా.. రాజకీయ కక్షల నేపథ్యంలో గుర్తు తెలియని వ్యక్తులు తమ ఇళ్లకు నిప్పు పెట్టారని స్థానికులు చెబుతున్నారు.

తోట‌ వంశీ కుమార్‌

Next Story