ఏపీ సచివాలయంలోని రెండవ బ్లాక్‌లో అగ్నిప్రమాదం..అందులోనే డిప్యూటీ సీఎం పేషీ

ఆంధ్రప్రదేశ్ సచివాలయంలోని రెండవ బ్లాక్‌లో అగ్నిప్రమాదం సంభవించింది.

By Knakam Karthik
Published on : 4 April 2025 7:55 AM IST

Andrapradesh, AP Secretariat, Fire breaks, Deputy CM Pawan Kalyan

ఏపీ సచివాలయంలోని రెండవ బ్లాక్‌లో అగ్నిప్రమాదం..అందులోనే డిప్యూటీ సీఎం పేషీ

ఆంధ్రప్రదేశ్ సచివాలయంలోని రెండవ బ్లాక్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. రెండో బ్లాక్ బిల్డింగ్‌లో బ్యాటరీలు ఉంచే ప్రాంతంలో అగ్నిప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రమాదం విషయం తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బందికి ఎస్పీఎఫ్ సిబ్బంది సమాచారం అందించారు. వెంటనే వారు అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే ఈ ఘటన ప్రమాదశాత్తు జరిగిందా? కుట్ర కోణం ఏమైనా ఉందా అనే కోణంలోనూ దర్యాప్తు ప్రారంభించారు. కాగా తెల్లవారుజామున ఈ ప్రమాదం జరగడంతో సిబ్బంది ఎవరూ లోపల లేరని సమాచారం.

కాగా సచివాలయంలోని రెండో బ్లాక్‌లోనే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, టూరిజం మంత్రి కందుల దుర్గేష్, దేవదాయశాఖ మంత్రి ఆనం, మున్సిపల్ మంత్రి నారాయణ, హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత పేషీలు ఉన్నాయి.

Next Story