అన‌కాప‌ల్లి జిల్లాలో ఘోర అగ్నిప్ర‌మాదం.. ఐదుగురు కార్మికులు మృతి

Fire At Parawada Pharma City Five dead.ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఘోర అగ్ని ప్ర‌మాదం చోటు చేసుకుంది. ఈ ఘ‌ట‌న‌లో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 Dec 2022 8:09 AM IST
అన‌కాప‌ల్లి జిల్లాలో ఘోర అగ్నిప్ర‌మాదం.. ఐదుగురు కార్మికులు మృతి

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఘోర అగ్ని ప్ర‌మాదం చోటు చేసుకుంది. ఈ ఘ‌ట‌న‌లో ఐదుగురు మృతి చెందారు.

అనకాపల్లి జిల్లా పరవాడలోని లారస్ ఫార్మా కంపెనీలోని మూడో యూనిట్‌లో మంట‌లు చెల‌రేగాయి. క్ష‌ణాల్లో మంట‌లు ఉవ్వెత్తున ఎగిసిప‌డ్డాయి. మంట‌ల‌ను చూసి కార్మికులు భ‌యంతో ప‌రుగులు తీశారు. వెంట‌నే పోలీసులు, అగ్నిమాప‌క సిబ్బందికి స‌మాచారం అందించారు. ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్న అగ్నిమాప‌క సిబ్బంది మంట‌ల‌ను అదుపులోకి తీసుకువ‌చ్చారు. ఈ ఘ‌ట‌న‌లో ఐదుగురు కార్మికులు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. న‌లుగురు ఆస్ప‌త్రికి త‌ర‌లిస్తుండ‌గా మ‌ర‌ణించారు. మ‌రొక‌రు ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఈ ఘ‌ట‌న‌లో మృతి చెందిన వారి సంఖ్య ఐదుకు చేరింది.

మృతుల‌ను అనకాపల్లి జిల్లాకు చెందిన రామకృష్ణ, గుంటూరు జిల్లాకు చెందిన రాజేశ్ బాబు, రంగారెడ్డి జిల్లాకు చెందిన సతీశ్, ఖమ్మం జిల్లాకు చెందిన రాంబాబు, చోడవరం నియోజకవర్గానికి చెందిన వెంకట్రావ్ గా గుర్తించారు. షార్ట్ సర్య్కూట్ కార‌ణంగానే ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. దీనిపై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Next Story