కృష్ణా జిల్లాలో భారీ అగ్నిప్రమాదం

Fire Accident in Vijaya Polymers.కృష్ణా జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ప్లాస్టిక్ బ్యాగులు త‌యారు చేసే కంపెనీలో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  3 Sep 2021 3:35 AM GMT
కృష్ణా జిల్లాలో భారీ అగ్నిప్రమాదం

కృష్ణా జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ప్లాస్టిక్ బ్యాగులు త‌యారు చేసే కంపెనీలో భారీగా మంట‌లు చెల‌రేగాయి. ఆ ప్రాంతంలో భారీగా మంట‌లు ఎగిసి ప‌డ‌డంతో పాటు ద‌ట్ట‌మైన పొగ అలుముకుంది. పెద్ద ఎత్తున ఎగిసిప‌డుతున్న మంట‌లను చూసి స్థానికులు భ‌యంతో ప‌రుగులు తీశారు. శుక్రవారం తెల్లవారు జామున ఉంగుటూరు మండలం తెంపల్లి రైల్వే గేట్ సమీపంలో గ‌ల శ్రీవిద్య పాలిమర్స్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

ఉదయం 5 గంట‌ల ప్రాంతంలో కంపెనీలో ఒక్క‌సారిగా మంట‌లు చెల‌రేగాయి. పాలిమ‌ర్స్ ప‌రిశ్ర‌మ కావ‌డంతో క్ష‌ణాల్లో మంట‌లు ఫ్యాక్ట‌రీ మొత్తం వ్యాపించాయి. ఉవ్వెత్తున మంట‌లు ఎగిసిప‌డ్డాయి. గ‌మ‌నించిన స్థానికులు అగ్నిమాప‌క సిబ్బందికి స‌మాచారం అందించారు. వెంట‌నే అక్క‌డ‌కు చేరుకున్న అగ్నిమాప‌క సిబ్బంది మంట‌ల‌ను అదుపులోకి తీసుకురావ‌డానికి తీవ్రంగా శ్ర‌మిస్తున్నారు. కాగా.. ఈ కంపెనీలో సూపర్ సంచులు తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్ర‌మాదానికి గ‌ల కార‌ణాలు ఇంకా తెలియ‌రాలేదు. ఎటువంటి ప్రాణ న‌ష్టం జ‌ర‌గ‌లేదు. అయితే..భారీగా ఆస్తి న‌ష్టం వాటిల్లింద‌ని అంటున్నారు.

Next Story
Share it